జ‌వాన్ దేవేంద్ర‌సింగ్‌కు ఉత్త‌రాఖండ్ సీఎం నివాళులు

ఉగ్ర‌వాదుల‌తో పోరులో ఇటీవ‌ల ప్రాణాలు కోల్పోయిన భార‌త సైనికుడు దేవేంద్ర‌సింగ్‌కు ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ నివాళులు అర్పించారు. ఉత్త‌రాఖండ్ రాష్ట్రం, రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లాలోని జ‌వాన్‌ దేవేంద్ర‌సింగ్ స్వ‌గ్రామంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ఆయ‌న భౌతిక‌కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. అంతిమ యాత్ర‌లో ముఖ్య‌మంత్రి త్రివేంద్ర‌సింగ్ స‌హా, ప‌లువురు నాయ‌కులు, ఆర్మీ, పోలీస్ అధికారులు స‌హా జ‌వాన్‌ దేవేంద్ర‌సింగ్ బంధుమిత్రులు పెద్ద‌సంఖ్య‌లో పాల్గొన్నారు. గ‌త ఆదివారం జ‌మ్ముక‌శ్మీర్లోని కిరాన్ సెక్టార్లో భార‌త జ‌వాన్లు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య జ‌రిగిన భీక‌ర పోరులో దేవేంద్ర‌సింగ్ మ‌ర‌ణించారు.