లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద కార్మికులకి తమ వంతు సాయం చేసేందుకు సినీ కళాకారులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఛారిటీలకి నగదుని విరాళం అందిస్తుండగా, మరి కొందరు నిత్యావసర వస్తువులు సప్లై చేస్తున్నారు. తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న 50 పేద కుటుoబాలకు నెలకు సరిపడేవిధంగా సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటారు.
ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. 74,655 మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 13,46,085 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 2,78,534 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అత్యధికంగా ఇటలీలో 16,532 మంది ప్రాణాలు కోల్పోగా, స్పెయిన్‌లో 13,341 మంది, యూఎస్‌ఏలో 10,871 మంది, ఫ్రాన్స్‌లో 8,911, యూకేలో 5,373 మంది, ఇరాన్‌లో 3,739 మంది, జర్మనీలో 1,810 మంది, బెల్జియంలో 1,632, నెదర్లాండ్స్‌లో 1,867 మంది, టర్కీలో 649, స్విట్జర్లాండ్‌లో 765 మంది మృతి చెందారు.