గుడుంబా తయారీ దారులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిన సర్కారు

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర స ర్కారు, పునరావాస పథకం ద్వారా గుడుంబా తయా రీ దారులకు ప్రత్యామ్నాయ మార్గం చూపి.. వారి స్వ యం ఉపాధికి బాటలు వేసింది. గుడుంబాను పూ ర్తిగా అరికట్టడమేగాకుండా తాగుడుకు బానిసవుతున్న నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు చర్య లు తీసుకున్నది. జిల్లాలో 47 కుటుంబాలను గుర్తించిన అధికారులు, ఒక్కొక్క కుటుంబానికి రూ. 2 లక్ష ల చొప్పున ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధిని కల్పించారు. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం తయారీదారులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. జిల్లా అబ్కారీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసిన అధికారులు గుడుంబా తయా రు చేస్తున్న వారిపై నిఘా పెట్టి, గుడుంబా స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు, తయారీ దారులు, అమ్మేవారిపై కేసులు పెట్టి అరెస్టులు శారు. పలువురికి శిక్షలు పడ్డాయి. గుడుంబా తయారు చేస్తూ అరెస్టులు, జైలు శిక్షల సమయంలో తాము ఎలా బతకాలో చెప్పాలనీ.. ప్రత్నామ్నాయం చూపితే భవిష్యత్‌లో ఈ పనులు చేయమని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి వెళ్లడం అందుకు అనుగుణమైన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.