బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ జీరో సినిమా తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైన విషయం తెలిసిందే. ఆయన తదుపరి చిత్రాన్ని ఎవరి దర్శకత్వంలో చేయబోతారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం ప్రకారం షారూఖ్ బ్రహ్మాస్త్ర చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో అమితాబ్ బచ్చన్ , నాగార్జున, డింపుల్ కపాడియా కీలక పాత్రలు చేస్తున్నారు. పలు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్ర తొలి పార్ట్ 2020లో విడుదల కానుందని చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా షూటింగ్ కొద్ది రోజులు వాయిదా పడుతుండడంతో రిలీజ్ డేట్‌పై సందిగ్ధం నెలకొంది. అయితే ఈ చిత్రంలో షారూఖ్ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నాడని, ఆయన సన్నివేశాలతోనే మూవీ ప్రారంభం కానుందని బాలీవుడ్ మీడియా చెబుతుంది. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.