ఫిబ్రవరి 8వ తేదీన కార్టూన్‌ ఫెస్టివల్‌

కార్టూన్‌ ఫెస్టివల్‌ 2020 హైదరాబాద్‌లో ద పార్క్‌ హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు కార్టూన్‌ వాచ్‌ మంత్లీ ఎడిటర్‌ త్రియంబక్‌ శర్మ తెలిపారు. కార్టూన్‌ వాచ్‌ గత 24 సంవత్సరాలుగా కార్టూన్లు మాత్రమే పబ్లిష్‌ అయ్యే మాగ్జిన్‌గా నిలిచిందన్నారు. గతంలో కార్టూన్‌ ఫెస్టివల్‌ను ఢిల్లీ, ముంబయి, రాయ్‌పూర్‌, పుణ, చెన్నైలో నిర్వహించామని, ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథులుగా భిజేంద్రకుమార్‌ ఐఏఎస్‌, సీఎండీ ఎన్‌ఎండీసీ. స్పెషల్‌ గెస్ట్‌లుగా తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతికశాఖ, భాషా, కల్చరల్‌ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, తెలంగాణ టుడే ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కట్టా శేఖర్‌రెడ్డి, సాక్షి ఎడిటర్‌ మురళి, హరిభూమి ఎడిటర్‌ డాక్టర్‌ హిమాంషు ద్వివేది-ఛత్తీస్‌గఢ్‌లు హాజరుకానున్నారు. ఫెస్టివల్‌లో 2019 సంవత్సరానికి గాను లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను సీనియర్‌ కార్టూనిస్ట్‌ స్వర్గీయ మోహాన్‌, సీనియర్‌ కార్టూనిస్ట్‌ జయదేవ్ బాబు, సీనియర్‌ కార్టూనిస్ట్‌ ఎమ్‌ఎస్‌ రామకృష్ణలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2020 సంవత్సరానికి గాను లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులను నమస్తే తెలంగాణ కార్టూనిస్ట్‌ మృత్యుంజయ్‌, సాక్షి కార్టూనిస్ట్‌ శంకర్‌, నవతెలంగాణ కార్టూనిస్ట్‌ నర్సింహాలకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.