పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ - 2020 నోటిఫికేషన్‌ను మార్చి 2న జారీ చేయనున్నారు. ఏప్రిల్ 17న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు సాంకేతిక బోర్డు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. అర్హులైన పదో తరగతి విద్యార్థులు.. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.