<no title>ప్రియాంకరెడ్డి హత్య-షాద్ నగర్ లాయర్లు సంచలన నిర్ణయం

ప్రియాంకరెడ్డి హత్య-షాద్ నగర్ లాయర్లు సంచలన నిర్ణయం


తెలంగాణ రాష్ట్రంతోనే కాకుండా యావత్తు దేశంలోనే సంచలనం రేకెత్తించిన వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం.. హత్య ఉదాంతంపై దేశ వ్యాప్తంగా స్పందన వచ్చింది. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కూడా సర్వత్రా నిరసనలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఘటన జరిగిన షాద్ నగర్ కు చెందిన న్యాయవాదులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా షాద్ నగర్ కోర్టులో నిందితులకు న్యాయ సహకారం చేయకూడదని లాయర్లంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇటు దిశ నిందితులను రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు.